KNR: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను కరీంనగర్ బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బీ. రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవడమే బాబాసాహెబ్‌కు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.