AP: అమరావతి వేదికగా డిసెంబర్ నుంచి ‘క్వాంటం వ్యాలీ’ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ నినాదంతో పాటు, ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్ తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. RTIH ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఐఐటీ-చెన్నై, IBM వంటి ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో యువతకు క్వాంటం రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు.