VKB: ఆలంపల్లికి చెందిన ప్రణీత్ అనే 9వ తరగతి విద్యార్థి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. స్కూల్‌కు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన ప్రణీత్, పాఠశాలకు చేరుకోలేదు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 98485 99876 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.