AP: రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు. మరో రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం తొలి విడతగా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. మునిగిన పంట పొలాలకు గానూ ఎకరానికి పది వేల రూపాయలు ఇస్తామని వివరించారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వరదల్లో నష్టపోయిన ప్రతి ఇంటికి ఇప్పటికే పరిహారం ఇచ్చామని తెలిపారు. కేటీఆర్ ప్రభుత్వంపై నిందలు వేసే పని పెట్టుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.