AP: కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై పోలీసులు కేసు నమోదుచేశారు. డాక్టర్ ఉమామహేశ్వరరావును దూషించిన కేసులో రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫిర్యాదుపై నానాజీతో పాటు అతని అనుచరులపై సర్పవరం పోలీస్ స్టేషన్లో FIR ఓపెన్ చేశారు. ఇందులో ఏ1గా నానాజీ పేరు చేర్చారు. కాగా ఈ నెల 21న కాలేజ్ గ్రౌండ్లో వాలీబాల్ ఆడే విషయంలో వైద్యుడిని నానాజీ బూతులు తిట్టి తర్వాత క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే.