పెద్దపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చిగురు మామిడి మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రుణమాఫీ ఎవరికైనా రాకపోతే ఏఈవోలని కలిసి సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్లు, మరమ్మతులు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు.