AP: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి కారును అడ్డుకోబోయిన కూటమి కార్యకర్తను పట్టించుకోకుండా డ్రైవింగ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారన్నారు. గతంలోచేసిన తప్పులకు కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదన్నారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని చెప్పారు.