TG: రాష్ట్రంలో రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఒకే కార్డ్ ఉండేలా విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. వన్ స్టేట్-వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోవాలని.. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబసభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందించాలని అన్నారు. ఫైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.