NDL: ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ సూచనల మేరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ టైగర్ ప్రాజెక్ట్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు రుద్రవరం రేంజ్ కార్యాలయ పరిసరాలలోని ప్లాస్టిక్, వ్యర్థాలను తొలగించారు.