SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శిరీష ఆదివారం పర్యటించారు. ఈ మేరకు స్థానిక గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉండే సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఇటీవల మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.