హైదరాబాద్ ప్రజాభవన్లో క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం జాతీయస్థాయిలో సమగ్ర కుల జనగణన జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో చేపట్టిన కుల సర్వే దేశానికే ఆదర్శమన్నారు. కుల లెక్కింపు ప్రాధాన్యతను ఈ గ్రంథం ప్రతిపాదిస్తుందని రచయితలు అన్నారు.