ADB: ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఉట్నూర్ మండలం దంతన్ పల్లికి చెందిన సౌజన్య ఆదివారం వెలువడిన ఫలితాలను చూసి తీవ్ర ఆవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.