HNK: ప్రైవేట్ చిట్ ఫండ్లో డబ్బులు పెట్టి ఇబ్బంది పడుతున్న బాధితులకు తక్షణమే డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేడు రిజిస్టార్కు ప్రభాకర్ రెడ్డి అందించారు. ప్రైవేట్ చిట్టీల ద్వారా సేకరించిన ప్రజాధనాన్ని కాజేసిన వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.