VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధన, ఇతర అవసరాలకు వినియోగించేందుకు విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం స్టోర్ లో ఈనెల 21న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేసారు. ప్రస్తుతం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు విక్రయిస్తారు.