NRML: దిలావర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దుర్గం శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా వారు అధికారులను ఆదేశించారు.