ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కర్కశత్వం మరోసారి బయటపడింది. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఇద్దరు మహిళలను ఉరి తీసింది. దక్షిణ కొరియాకు పారిపోవాలనుకున్న కొందరు ఉత్తర కొరియా వాసులకు ఆ ఇద్దరు సహకరించడమే దీనికి కారణం. ఆ మహిళలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ.. బహిరంగ విచారణ జరిపి ఉరి తీశారు. మరో తొమ్మిది మంది మహిళలకు జీవిత ఖైదు విధించారు.