ELR: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో సీపీఎం మహాసభ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు ఎం. జీవరత్నం, జి. సూర్యకిరణ్లు మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం అనేక పోరాటాలు చేస్తుందన్నారు. 200 ఎకరాల సీలింగ్ భూములను పేదలకు భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.