CTR: విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ సరస్వతి అన్నారు. పుంగనూరు పట్టణం చింతల వీధి పురపాలక ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘనంగా వార్షికోత్సవం, 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి విద్యార్థి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో చదువుకోవాలన్నారు.