NGKL: కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఆసుపత్రి కార్మికులు ఏడీ సంపత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. తక్కువ వేతనాలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని సీఐటీయూ నేత పొదిల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 23న హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం ముట్టడికి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.