కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు అప్పన్నపేటలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కొబ్బరి మట్టలు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో మెండు శ్రీనివాసరావు, కాట్రు కృష్ణ, తాళ్ళ దుర్గారావు వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడడంతో ఇరు వర్గాల ఫిర్యాదులతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు తాలూకా ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. ఈ ఘటనలో 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.