PDL: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి, రాష్ట్ర నాయకుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి సందర్శించారు. మక్కలు, వడ్లకు సకాలంలో కంటాలు పెట్టి రైతులను తలుతరుగు పేరుతో ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. రేపు పెద్దపల్లిలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.