TPT: పెళ్లకూరు మండలం దొడ్లవారిమెట్టకు చెందిన భువన (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భువన ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని భర్త ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే ఆమె మృతిచెందింది. భువన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.