ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగునీటి విప్లవం కౌలు ధరలను పరుగులు పెట్టిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ కాలువల ద్వారా పుష్కలంగా నీరు అందుతుండటంతో రెండు పంటలకు భరోసా ఏర్పడింది. దీంతో సారవంతమైన భూములకు డిమాండ్ పెరిగి, ఏటేటా కౌలు ధరలు 20% వరకు ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లో వరి, పసుపు సాగుతో కౌలు రేట్లు రికార్డు స్థాయికి చేరాయి.