BPT: అద్దంకి మండల పరిధిలోని బొమ్మినేనివారిపాలెం గ్రామంలో దారుణమైన దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన అయినబత్తుని అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసును దొంగిలించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అద్దంకి సిఐ సుబ్బరాజు తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.