PPM: అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం పార్వతీపురం నియోజకవర్గానికి అధ్యక్షులుగా చొక్కాపు వెంకటరావుని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియమించారు. అలాగే, కార్యదర్శిగా పిన్నింటి జయకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు కళ్యాణిని ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ.. బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.