పాక్ క్రికెటర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలాడు. ఈ ఘటనపై PCB తీవ్రంగా స్పందిస్తూ.. నవాజ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు బోర్డు తెలిపింది. ఒకవేళ నవాజ్ నేరం రుజువైతే, అతడిపై శాశ్వత నిషేధం విధించే అవకాశం ఉంది. కాగా, ఇటీవల ముగిసిన T20 WCలో అతడు నిషేధిత డ్రగ్స్ వాడినట్లు నిరూపితమైంది.