జగిత్యాల జిల్లాలో మే 1-10 వరకు మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సహాయ కార్మిక కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే డే సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, ఫ్యాక్టరీల నుంచి ప్రత్యేక కేటగిరిలో నామినేషన్లు ఈనెల 18- 27 వరకు స్వీకరిస్తారు. ఆసక్తి గలవారు పూర్తి చేసిన దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలన్నారు.