WG: పాలకొల్లులోని పెద్ద సాయిబాబా గుడి రోడ్ వద్ద శ్రీసాయి గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పెద్ద ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. అనంతరం అన్నసమారాధనకు రూ.3000 ఆర్థిక సాయం చేశారు.