ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2nd B.Com విద్యార్థిని తామల జ్యోతిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చలపతిరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జ్యోతికను సత్కరించారు. ఈనెల 17, 18 తేదీలలో రాంచిలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో జ్యోతిక జావెలిన్‌త్రో విభాగంలో ద్వితీయ స్థానం సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించింది.