కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ‘జనగణన 2026’ ప్రధాన అంశంగా విద్యార్ధులలో చైతన్యాన్ని పెంపొందించడానికి గురువారం వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు నిమ్మకాయల గణేశ్వరరావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.