SKLM: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా నాలుగో సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సౌకర్యాలను, పరీక్షా నిర్వహణ తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డీన్ శివరామకృష్ణ ఉన్నారు