ATP: గుంతకల్లు MLA గుమ్మనూరు జయరాంపై యూట్యూబ్ ఛానల్లో వస్తున్న అసత్య ప్రచారాలను పామిడి కూటమి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం తగదని మండిపడ్డారు. అసత్య ఆరోపణలు చేసే వారు బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు.