SKLM: కలెక్టరేట్లో గురువారం భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగీరథ మహర్షీ స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణను చేద్దామని అన్నారు. దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని కొనియాడారు.