ప్రకాశం: పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో కొద్ది రోజులుగా దొంగలు రెచ్చిపోతున్నారు. గ్రామంలోని రైతుల ట్రాన్స్ఫార్మర్లను దొంగలిస్తూ రైతులకు దొంగలు తలనొప్పిగా మారారు. గ్రామంలోని మూడు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరుని దొంగిలించడంతో బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. ధూపడులో బుధవారం రాత్రి ఇదే తరహాలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే.