BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి హైదరాబాద్కు చెందిన భక్తుడు భారీ విరాళం సమర్పించారు. సికింద్రాబాద్ సీతారాంనగర్కు చెందిన ఆదిత్య అనే భక్తుడు గురువారం స్వామివారిని దర్శించుకుని, సుమారు రూ.30 లక్షల విలువైన మూడు రకాల బంగారు ఆభరణాలను కానుకగా అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందజేసి, ప్రత్యేక ఆశీర్వచనాలు పలికారు.