RR: హఫీజ్పేట్ డివిజన్ ప్రకాష్ నగర్లో సాగర సంగం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి బాలింగ్ గౌతమ్ గౌడ్ మహర్షి చిత్రపటానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టుదలకు నిదర్శనమైన భగీరథుని ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.