TG: మాజీ సీఎం కేసీఆర్ తన సొంత బ్రాండ్ కోసమే కాళేశ్వరం నిర్మించి రాష్ట్ర సంపదను వృథా చేశారని ఎంపీ చామల కిరణ్ విమర్శించారు. ప్రాజెక్ట్ కట్టిన రెండేళ్లకే ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే ప్రమాదమని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.