WGL: రాయపర్తి మండలంలోని రాగన్నగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకూడదని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు.