KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్లో గురువారం ధరలు ప్రకటించబడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠంగా రూ.9,164, వేరుశనగ రూ.7,094, ఆముదాలు రూ.6,097, కందులు రూ.7,311 ఉన్నాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.