NZB: డిచ్పల్లి మండలం రాంపూర్ వృద్ధాశ్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. సదుపాయాల లోపం, నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూలర్లు, టీవీ వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. వృద్ధుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించి, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు సమకూర్చాలని సూచించారు. నిర్వహణలో మార్పు లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.