MLG: ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, రాంనగర్లో ఈదురు గాలులతో కూలిన ఇళ్లు, అకాల వర్షం వల్ల కలిగిన పంట నష్టాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. వరి, మిర్చి, మక్కజొన్న, మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లిందని, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు. బాధిత రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.