SS: గోరంట్లలోని అంగన్వాడి కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎంపీడీవో కమలాబాయి, ఎంఈఓ జాన్ రెడ్డప్ప హాజరై 15 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించారు. ఉత్తమంగా పనిచేసిన అంగన్వాడి కార్యకర్తలకు బహుమతులు అందజేశారు. 3 ఏళ్ల పిల్లలను అంగన్వాడీలలో చేర్చాలని తల్లిదండ్రులను కోరారు.