KMM: CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేసిన రూ.71 వేల విలువైన నాలుగు మొబైల్ ఫోన్లను ముదిగొండ ఇన్స్పెక్టర్ ఓ.మురళీ గురువారం బాధితులకు అందజేశారు. ఫోన్లు పోగొట్టుకున్న వారి ఫిర్యాదుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.