TG: అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ షురూ అయ్యింది. కూకట్పల్లి, అమీన్పూర్లో మొత్తం 3 చోట్ల ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో నల్లచెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు రోదిస్తున్నారు. తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.