TG: మజీ మంత్రి కేటీఆర్‌కి కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ వేశారు. అమృత్ టెండర్లలో అవకతవకలుంటే KTR కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు. కానీ, బీజేపీని ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ‘ప్రచారంలో ఉండటం కోసమే కేటీఆర్ ఆరాటం. కేటీఆర్ కుటుంబం, కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా ఓటుకు నోటు ప్రస్తావన తెచ్చారా?. కాంగ్రెస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్ కేసు ఎక్కడికి పోయాయి’ అని నిలదీశారు.