కర్నూలు: బంగారుపేట మున్సిపల్ స్కూల్లో పొక్సో చట్టం, గూడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై మంగళవారం అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ చిన్నారులకు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సంప్రదించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల సమస్యలను స్నేహపూర్వకంగా తెలుసుకోవాలి అని సూచించారు. ప్రేమ, చెడు ఉద్దేశంతో ఉన్న స్పర్శలో తేడా గుర్తించుకోవాలని అవగాహన కల్పించారు.