మక్తల్ మండలం సత్యవార్లో రూ.3 కోట్లతో నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్‌కు మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ అమలవుతుంది. దీని ద్వారా ఏటా రూ.26 లక్షల ఆదాయం మహిళా సంఘాలకు లభిస్తుందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ, సభ్యులు పాల్గొన్నారు.