సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ నెల్సన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. నెల్సన్ కుమార్ గతంలో ఇళయదళపతి విజయ్‌తో బీస్ట్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. బలమైన కథాంశాలతో పాటుగా కామెడీ కూడా నెల్సన్ సినిమాలో చూడొచ్చు. ప్రస్తుతం నెల్సన్ తలైవాతో జైలర్ అనే సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. జైలర్ సినిమాకు సంబంధించి ఒక్కొక్కరూ షూటింగ్లో ఒక్కొక్కరూ పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వచ్చారు. ఈ సందర్భంగా మేకర్స్ ఆయన సెట్స్‌లోకి వచ్చిన ఓ స్టిల్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. జైలర్ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో జాకీ ష్రాఫ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలర్ సినిమా నుంచి అప్ డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.