NLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దేవరకొండ మున్సిపాలిటీలో మంగళవారం పారిశుద్ధ్య కార్మికులకు, మెప్మా సిబ్బందికి ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.