TPT: KVB పురం(M) తిమ్మసముద్రం చెంచయ్య కుమారుడు బి.చందు (14) రాగిగుంట ZPHSలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 14వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లడంతో బడికి వెళ్లి ఉంటాడని భావించారు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. సమీప గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా కనిపించలేదు. దీంతో చెంచయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.